Train Accident: ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పక్కకు పడిపోయిన ఎనిమిది బోగీలు

At least 8 wagons of goods train derail in Delhi Zakhira
  • ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదం
  • నెట్టింట వైరల్‌గా మారిన పట్టాలు తప్పిన వీడియో
  • ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న గూడ్స్ రైలు
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ట్రాక్‌ల నుంచి వ్యాగన్‌లు పట్టాలు తప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐర‌న్ షీట్ రోల్స్ ఉన్నాయి.
Train Accident
Indian Railways
New Delhi

More Telugu News