క్యాన్సర్ పై పోరుకు రష్యా వ్యాక్సీన్.. తయారీ తుది దశలో ఉందన్న పుతిన్
- త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించిన రష్యా ప్రెసిడెంట్
- కొత్తతరం మందులు కూడా తమ సైంటిస్టులు తయారుచేస్తున్నారని వివరణ
- మాస్కో ఫోరమ్ ఆన్ ఫ్యూచర్ టెక్నాలజీస్ సదస్సులో పుతిన్ వ్యాఖ్యలు
సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరసెస్ (హెచ్ పీవీ) ను అడ్డుకోవడానికి ఇప్పటికే వ్యాక్సీన్ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు కంపెనీలు ఈ వ్యాక్సీన్ తయారీకి లైసెన్స్ పొందాయి. పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాగే లివర్ క్యాన్సర్ కు కారణమయ్యే 'హెపటైటిస్ బి'కి కూడా వ్యాక్సిన్ వుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. భారత దేశంలోనూ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఏటా 13 నుంచి 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వీఎస్ డియో ఆందోళన వ్యక్తం చేశారు.