కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: అనగాని సత్యప్రసాద్
- జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అనగాని
- మూడు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్లకు ఇచ్చారని మండిపాటు
- జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న
రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు రాజ్యసభ సీటును ఇస్తున్నట్టు తొలుత జగన్ ప్రకటించారని అనగాని తెలిపారు. ఆ తర్వాత ఆయనను తొలగించి సొంత సామాజికవర్గానికి చెందిన మేడా రఘునాథరెడ్డికి కేటాయించారని మండిపడ్డారు. ఇది బలిజల గొంతు కోయడం కాదా? అని ప్రశ్నించారు. నమ్మించి గొంతులు కోయడం జగన్ జీన్స్ లోనే ఉందని అన్నారు. బలహీనవర్గాలంటే జగన్ కు చిన్నచూపు అని దుయ్యబట్టారు.