అందుకే నన్ను ట్రోల్ చేస్తున్నారు: సోహెల్
- బిగ్ బాస్ తో సోహెల్ కి గుర్తింపు
- సినిమాలతో ముందుకు వెళుతున్న తీరు
- బూట్ కట్ బాలరాజుకు లేని రెస్పాన్స్
- ఆ విషయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన హీరో
'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డాను. నాతో ఉంటే నేను పడిన కష్టాలను గురించి తెలిసేది. 'బిగ్ బాస్' హౌస్ లో ఉన్నప్పుడు ఆదరించారుగదా, అలాగే సినిమాల విషయంలోనూ సపోర్ట్ చేయమని అడిగాను. నా సినిమా చూడమని మీడియా ఎదురుగా ఎమోషనల్ అయ్యాను" అని అన్నాడు.
"నేను అలా అనడంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ వేరు .. సినిమా వేరు. కంటెంట్ ఉంటే మేమే సినిమా చూస్తాం కదా .. సినిమా చూడమని కెమెరా ముందు ఇలా అడుక్కోవడం ఎందుకు? అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమాకి వెళితేనే గదా కంటెంట్ ఎలా ఉందనేది తెలిసేది అనేది నా అభిప్రాయం. నేను రివ్యూలు రాసేవారిని కూడా ఏమీ ఎనలేదు. ఒక వ్యక్తి థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే రివ్యూ రాస్తుంటే అది కరెక్ట్ కాదని చెప్పానంతే" అని అన్నాడు.