అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు
- గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం
- సార్.. మీతో అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ నిరసన
- నినాదాల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన గవర్నర్
విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.