భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు... శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లో విశాఖ!
- ఇప్పటికే భారత్ లో వందే భారత్ రైళ్లు
- వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కి.మీ
- గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించనున్న హైస్పీడ్ రైళ్లు
- హైదరాబాద్-విశాఖ... కర్నూలు-విజయవాడ రూట్లలో ప్రతిపాదనలు
అయితే, ఈ హైస్పీడ్ రైళ్ల కోసం ఇప్పుడున్న రైల్వే లైన్లు అనువుగా ఉండవు. ఎంతో వేగంగా వెళ్లే ఈ రైళ్ల కోసం ట్రాక్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో, దేశంలోని పలు రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో రెండు రూట్లు ఉన్నాయి.
హైదరాబాద్-విశాఖపట్నం... కర్నూలు-విజయవాడ రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి దశలో ఉంది. ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే రిపోర్ట్ కూడా వస్తే, తదనంతరం డీపీఆర్ ప్రక్రియ చేపట్టనున్నారు.
కాగా, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు కాగా... హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేందుకు ఎలివేటెడ్ కారిడార్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్ ఇంకా పెరగనుంది. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టాలి అనేది పరిశీలించారు. మరో ఐదారు సంవత్సరాల్లో ఈ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.