Monitar Lizard: బౌండరీ లైన్ వద్ద అనుకోని అతిథి... కాసేపు నిలిచిన క్రికెట్ మ్యాచ్

Monitor lizard enters into ground while Sri Lanka batting against Afghanistan
  • శ్రీలంక-ఆఫ్ఘన్ మధ్య కొలంబోలో టెస్టు మ్యాచ్
  • లంక ఇన్నింగ్స్ లో 48వ ఓవర్ వద్ద ఉడుము ప్రత్యక్షం
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొలంబోలో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. నేడు ఆటకు రెండో రోజు కాగా, మైదానంలోకి అనుకోని అతిథి ప్రవేశించడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. 

శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా, ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ చేస్తోంది. అయితే, 48వ ఓవర్ వద్ద మైదానంలో బౌండరీ లైన్ వద్ద ఉడుము దర్శనమిచ్చింది. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఎట్టకేలకు దాన్ని మైదానం బయటకు పంపించడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. గతంలో శ్రీలంకలో ఓ క్రికెట్ మైదానంలో పాము కూడా వచ్చింది.
Monitar Lizard
Colombo
Sri Lanka
Afghanistan
Test Match

More Telugu News