Mallu Bhatti Vikramarka: ఖమ్మం లోక్ సభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న మల్లు భట్టి విక్రమార్క భార్య

Mallu Bhatti wife applied for khammam lok sabha seat
  • మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు
  • కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతల ఆసక్తి
  • ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో లోక్ సభ బరిలో నిలిచేందుకు ఆ పార్టీ నుంచి చాలామంది సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ సీటు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. సికింద్రాబాద్ సీటు కోసం రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి దరఖాస్తు చేసుకున్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
Telangana

More Telugu News