Telangana: తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల మంజూరు

Telangana government has sanctioned 10 crore to the In Charge ministers
  • 119 నియోజకవర్గాలకు 1,190 కోట్ల రూపాయల మంజూరు
  • ఇంఛార్జ్ మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవో విడుదల
  • విద్యాసంస్థలకు రూ.2 కోట్లు, మంచినీటి కోసం రూ.1 కోటి ఖర్చు చేయాలని సూచన

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాలకు రూ.1,190 కోట్లు మంజురు చేసింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలకు రూ.2 కోట్లు, మంచినీటి కోసం రూ.1 కోటి ఖర్చు చేయాలని స్పష్టంగా పేర్కొంది. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేయాలని పేర్కొంది.
ఈ మొత్తాన్ని ఆయా జిల్లా ఇంఛార్జ్‌లకు మంజూరు చేసింది.

ఆయా ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మొత్తం... ఇంఛార్జ్ మంత్రులు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు రూ.140 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ,
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు రూ.100 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి,
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు రూ.140 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు,
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు రూ.150 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్,
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలకు రూ.100 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాలకు రూ.100 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి సీతక్క,
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 09 నియోజకవర్గాలకు రూ.90 కోట్లు... ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.

  • Loading...

More Telugu News