రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్
- ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్
- పదిన్నర గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్
ఆ తర్వాత ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు కూడా చేరుకుంటారు. పదిన్నర గంటలకు కేంద్ర కేబినెట్ పార్లమెంట్ ఆవరణలో భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.