తల్లి అనారోగ్యంపై విరాట్ కోహ్లీ సోదరుడి క్లారిటీ

Virat kohli brother issues clarification over their mothers health
  • విరాట్ కోహ్లీ తల్లి అనారోగ్యం పాలయ్యారంటూ వార్తలు
  • అందుకే విరాట్ ఇంగ్లండ్‌తో రెండు టెస్టు మ్యాచులకు గైర్హాజరవుతాడని కథనాలు
  • వార్తలను ఖండించిన విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ
  • తమ తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టీకరణ
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సీరిస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. దీంతో, విరాట్ గైర్హాజరీపై పలు ఊహాగానాలు బయలుదేరాయి. కొందరు విరాట్ భార్య అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావించగా మరికొందరు అతడి తల్లి అనారోగ్యం పాలైందని పేర్కొన్నారు. అయితే విరాట్ తల్లి అనారోగ్యం వార్త నెట్టింట కలకలానికి దారి తీసింది. అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. 

కాగా, ఈ వదంతులకు విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ చెక్ పెట్టాడు. ‘‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్న ఓ ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టంగా చెబుతున్నా. ఈ వార్తలపై పూర్తిగా విచారించకుండా ప్రచారం కల్పించొద్దని మీడియాతో పాటూ ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా’’ అని వికాస్ పేర్కొన్నారు.
Advertisement
Virat Kohli mother
Vikas Kohli
Cricket

More Telugu News