సికింద్రాబాద్‌‌లోని పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు.. పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు

Stranger invaded in Secunderabad PG womens hostel
  • కిటికీలోంచి లోపలికి చొరబడిన యువకుడు
  • సైగ చేయడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు
  • హాస్టల్‌లో రక్షణ కరవైందంటూ అమ్మాయిల ధర్నా
సికింద్రాబాద్‌లోని పీజీ ఉమెన్స్ హాస్టల్‌లోకి ఆగంతుకుడు చొరబడడం కలకలం రేపింది. బాత్రూం కిటికీ నుంచి దుండగుడు లోపలికి చొరబడ్డాడు. అనంతరం విద్యార్థినులకు సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా అతడిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు. మొత్తం ముగ్గురు యువకులు లోపలికి చొరబడినట్టు విద్యార్థినులు చెబుతున్నారు.

దుండగుడు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్‌లో తమకు రక్షణ కరవైందని, వెంటనే సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Secunderabad
PG Hostel
Thief
Women Students

More Telugu News