పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడంపై స్పందించిన వెంకయ్య నాయుడు
- చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి
- శ్రేష్ఠ భారత్ నిర్మాణంలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసిందని వ్యాఖ్య
- పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు
ఇక తనతోపాటు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. తన నటనా పటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలనచిత్ర రంగానికి బహుముఖ సేవలు అందించారని ప్రశంసించారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మేటి నటీమణి, భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలంగాణకు చెందిన ఏవీ ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కే విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాలలో దేశానికి విశిష్ట సేవ, సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు.