కామాఖ్య దేవిని దర్శించుకున్న నటి తమన్నా.. ఫొటోలు ఇవిగో!

Actress Tamannaah visited Kamakhya Devi In Guwahati
  • కుటుంబ సభ్యులతో కలిసి గువాహటిలోని కామాఖ్య ఆలయం సందర్శన
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన మిల్కీ బ్యూటీ
  • ‘నా ప్రియమైనవారితో పవిత్రమైన క్షణాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన నటి
మిల్కీ బ్యూటీ తమన్నా గువాహటిలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ‘‘నా ప్రియమైనవారితో పవిత్రమైన క్షణాలు’’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. పసుపు రంగు సల్వార్ సూట్ ధరించిన తమన్నా ఆధ్యాత్మికంగా కనిపించింది. మరో ఫొటోలో ఆమె దీపాన్ని వెలిగిస్తూ కనిపించింది. ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న తమన్నా ఇటీవలే అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. 

కాగా తమన్నా ప్రస్తుతం అరుణ్ గోపీ దర్శకత్వంలో ‘బాంద్రా’ అనే ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా తమన్నా మలయాళ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీలో దిలీప్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా డినో మోరియా, మమతా మోహన్‌దాస్, కళాభవన్ షాజోన్, ఆర్ శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇక తమిళ హారర్ కామెడీ సినిమా ‘అరణ్మనై- 4, నిక్కిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్న ‘వేదా’లో కూడా నటిస్తోంది. ‘స్ట్రీట్- 2’ మూవీలో కూడా ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

వీడియో, ఫొటోల కోసం క్లిక్ చేయండి.
Go Back to Shorts
Tamannaah
Kamakhya Devi
Kamakhya Temple
Guwahati
Tollywood

More Telugu News