తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు
- గచ్చిబౌలి పీఎస్ లో నమోదైన కేసు టేకోవర్
- రెండు మూడు రోజుల్లో విచారించేందుకు అధికారుల ఏర్పాట్లు
- ఎఫ్ఐఆర్ లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ల పేర్లు
గొర్రెల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులలో ముందుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వారిని విచారిస్తారని అధికార వర్గాల సమాచారం. రెండు మూడు రోజుల్లో విచారణ మొదలవుతుందని తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు కొండాపూర్ కు చెందిన ‘లోలోనా ది లైవ్’ కంపెనీ కాంట్రాక్టర్ సయ్యద్ మొయిద్ కు ఈ స్కాంలో పాత్ర ఉందని తెలుస్తోంది.