Alla Ramakrishna Reddy: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Mangalagiri MLA Alla Ramakrishna Reddy joins Congress Party
  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల నియామకం
  • నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన షర్మిల
  • విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కార్యక్రమం
  • ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కే
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల

వైఎస్ షర్మిల ఇవాళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్కేకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు షర్మిలను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను షర్మిలతో పాటే రాజకీయ ప్రయాణం సాగిస్తానని, ఆమె ఏ పార్టీలోకి వెళితే తాను కూడా ఆ పార్టీలోకి వెళతానని కొన్నిరోజుల కిందటే ప్రకటించారు.

  • Loading...

More Telugu News