Shakeela: పెంపుడు కుమార్తె దాడి చేసిందంటూ పోలీసులను ఆశ్రయించిన షకీలా

Shakeela files complaint against adopted daughter Sheetal
  • అన్న కూతురు శీతల్ ను పెంచుకుంటున్న నటి షకీలా
  • కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో ఘర్షణ
  • ఇంటి నుంచి వెళ్లిపోయిన శీతల్
  • మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన షకీలా
  • శీతల్ తనపై దాడి చేసిందంటూ కోడంబాకం పీఎస్ లో ఫిర్యాదు
తన పెంపుడు కుమార్తె శీతల్ తనపై దాడి చేసిందంటూ నటి షకీలా పోలీసులను ఆశ్రయించారు. షకీలా తన సోదరుడి కుమార్తె శీతల్ ను పెంచుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా షకీలా, శీతల్ మధ్య కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వివాదాలు నెలకొన్నాయి. 

ఈ క్రమంలో షకీలా ఇంటి నుంచి శీతల్ నిన్న వెళ్లిపోయింది. న్యాయవాది సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని, ఇంటికి రావాలని శీతల్ ను షకీలా కోరారు. కన్న తల్లి, సోదరి జమీలాతో కలిసి వచ్చిన శీతల్... తనపై దాడికి పాల్పడిందని షకీలా చెన్నైలోని కోడంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాను ఎంత సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా శీతల్ తనపై దాడి చేసిందని వెల్లడించారు. ఆ సమయంలో తన నివాసంలో ఉన్న మహిళా న్యాయవాది సౌందర్యపై శీతల్ తల్లి దాడి చేసిందని షకీలా వివరించారు.

అటు, శీతల్ కూడా అదే పోలీస్ స్టేషన్ లో తన పెంపుడు తల్లి షకీలాపై ఫిర్యాదు చేసింది. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, సీసీటీవీ ఫుటేజి ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Shakeela
Sheetal
Police
Chennai

More Telugu News