రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు.... భద్రతా వలయంలో అయోధ్య
- రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం
- జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు
- అప్రమత్తమైన భద్రతా దళాలు
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. దాదాపు 7 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. అయోధ్యలో భద్రతను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం పర్యవేక్షిస్తోంది. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.