కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్... వీడియో ఇదిగో
- వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్
- వీడియోను పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్
- త్వరలో ప్రజల ముందుకు వస్తారన్న సంతోష్ కుమార్
సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో... కేసీఆర్ ఓ ఊతకర్ర సాయంతో.. వైద్య సహాయకుడి సమక్షంలో మెల్లిగా అడుగులు వేస్తున్నారు. అలా తన ఇంటి హాలు మొత్తం నడిచారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సంతోష్ కుమార్... ఆయన ప్రతి అడుగులో దృఢ సంకల్పం కనిపిస్తోందని... కర్ర సాయంతో నడుస్తున్నాడని... త్వరలో ప్రజల ముందుకు వస్తారని పేర్కొన్నారు.