ఇది మెగా-అల్లు గ్రూప్ ఫొటో... సంక్రాంతి జోష్ మామూలుగా లేదు!
- సంక్రాంతికి బెంగళూరు వెళ్లిన మెగా, అల్లు కుటుంబాలు
- ఫాంహౌస్ లో సంబరాలే సంబరాలు
- నెట్టింట వైరల్ అవుతున్న మెగా, అల్లు వారి గ్రూప్ ఫొటో
తాజాగా, మెగా, అల్లు కుటుంబాల గ్రూప్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు అందరినీ ఈ ఫొటోలో చూడొచ్చు. మెగా, అల్లు అభిమానులకు ఈ ఫొటో కనులపండుగేనని చెప్పాలి. మగవాళ్లందరూ వైట్ షేడ్ లో ఉన్న దుస్తులు ధరించగా, ఆడవాళ్లు ఎరుపు కాంబినేషన్ లో దుస్తులు ధరించారు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఫొటోలో మిస్సయ్యారు.