ఫాంహౌస్ లో బొప్పాయి సాగు.. విత్తనాల కోసం కేసీఆర్ ఫోన్.. వీడియో ఇదిగో!
- ఒంటిమామిడిలోని ఫర్టిలైజర్ షాపు ఓనర్ కు ఫోన్ చేసిన మాజీ సీఎం
- ఎరువులు పంపించాలని కోరినట్లు వీడియో
- కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన షాపు యజమాని
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలోని ఫర్టిలైజర్ షాపు యజమాని బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఫోన్ చేశారు. ఈసారి ఫాంహౌస్ లో బొప్పాయి, పుచ్చకాయ, ఇతరత్రా పంటలు సాగు చేద్దామని చెప్పారు. వ్యవసాయ పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని వివరించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను రెండు మూడు రోజుల్లో ఫాంహౌస్ కు పంపించాలని బాపురెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి బాపురెడ్డి విచారించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది సార్..’ అని అడగగా ఇప్పుడు అంతా బాగుందని, త్వరగా కోలుకున్నానని కేసీఆర్ బదులిచ్చారు.