విప్రోలో ఉద్యోగం కోసం వెళితే నన్ను తీసుకోలేదు: నారాయణ మూర్తి
- కెరీర్ ప్రారంభంలో జరిగిన విషయాన్ని వెల్లడించిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్
- ఆ తర్వాతి కాలంలో అదే సంస్థతో పోటీ పడి గెలిచామన్న నారాయణ మూర్తి
- అప్పట్లో తనకు ఉద్యోగం ఇవ్వకపోవడం భారీ తప్పిదమని అజీమ్ ప్రేమ్ జీ చెప్పినట్లు వెల్లడి
విప్రోలో ఉద్యోగం వచ్చి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని నారాయణ మూర్తి చెప్పారు. ఆ ఉద్యోగం రాకపోవడంతో తర్వాతి కాలంలో స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్ ను ప్రారంభించడం జరిగిందని వివరించారు. తన భార్య సుధా మూర్తి వద్ద రూ.10 వేలు తీసుకుని ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. 1981లో స్థాపించిన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుత స్థితికి చేరిందని వివరించారు. దాదాపుగా అదే సమయంలో విప్రో కూడా ఐటీ రంగంలోకి ప్రవేశించినా తమతో పోటీ పడలేక పోయిందని చెప్పారు. వ్యాపారపరంగా అజీమ్ ప్రేమ్ జీ, తాను చాలాసార్లు కలుసుకున్నామని నారాయణ మూర్తి చెప్పారు. ఓ సందర్భంలో అజీమ్ ప్రేమ్ జీ తనతో మాట్లాడుతూ.. ‘అప్పట్లో నిన్ను ఉద్యోగంలోకి తీసుకోకపోవడం నేను చేసిన అతిపెద్ద తప్పిదాలలో ఒకటి’ అని ఆయన చెప్పారన్నారు.