జూపల్లి రామేశ్వరరావుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన వైఎస్ షర్మిల
- ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం
- ఈ రోజు రామేశ్వరరావు నివాసంలో కలిసిన షర్మిల
- కొడుకు పెళ్లికి రావాలని రామేశ్వరరావు దంపతులకు ఆహ్వానం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరగనున్నాయి.