ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం వచ్చింది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం
- కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కేటీఆర్
- లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని దిశా నిర్దేశం
కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గళాన్ని... బలాన్ని ఢిల్లీకి చూపించవలసి ఉందన్నారు. మన గళం వినపడాలంటే... మన బలం చూపించాలంటే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలన్నారు. తల్లడిల్లిన తెలంగాణను పదేళ్ల పాటు మనం కాపాడుకున్నామని... కానీ కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయామన్నారు.
వినయ్ భాస్కర్‌కు చురక
తెలంగాణ భవన్‌లో జరిగిన వరంగల్ పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆలస్యంగా వచ్చారు. దీంతో కేటీఆర్ ఆయనకు చురక అంటించారు. అసెంబ్లీకి ఆలస్యంగానే వస్తారు... ఇప్పుడు సమావేశాలకు కూడా ఆలస్యమేనా? అంటూ సున్నితంగా మందలించారు.