భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు.. రెనాల్ట్ నుంచి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ)ఈజీ-ఆర్.. ఆల్టోకు గట్టిపోటీ!
- ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే
- బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్
- మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్
2024 రెనాల్ట్ క్విడ్ శ్రేణిని మూడు కొత్త డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ బాడీ కలర్‌తో తీసుకొచ్చింది. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ మీడియా ఎన్ఏహెవీ సిస్టంను చేర్చింది. ఫలితంగా ఇండస్ట్రీలో టచ్‌స్క్రీన్ మీడియా ఎన్ఏవీతో కూడిన అత్యంత చవకైన కారుగా ఇది రికార్డులకెక్కింది. ఆటోమెటిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెనాల్ట్ ఈ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ప్రయాణికులకు ఇందులో మరింత మెరుగైన రక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ఇందులోని అన్ని వేరియంట్లలోనూ సీట్‌బెల్ట్ రిమైండర్ ఉంది. 14 సేఫ్టీ ప్రమాణాలను ఏర్పాటు చేశారు.