నన్ను ప్రేమిస్తే సరే.. లేదంటే నువ్వు కాల్‌గార్ల్‌వి అయిపోతావ్.. జూబ్లీహిల్స్‌లో యువకుడి బెదిరింపు
- యువతి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- ప్రేమించకుంటే కాల్‌గర్ల్‌వని సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని హెచ్చరిక
- ఆగడాలు శ్రుతిమించడంతోో పోలీసులకు ఫిర్యాదు
ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న ఖయ్యూం వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ లాక్కుని, స్కూటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ నెల 4న రాత్రి 10 గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి బయటి నుంచి పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడాడు. నువ్వు కాల్‌గర్ల్‌వని సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.