హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

Traffic jam near Hyderabad and Nagpur national highway
  • ఓ యువతిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టించి చంపేశారని ఆరోపణలు
  • జాతీయ రహదారిపై యువతి కుటుంబ సభ్యుల ఆందోళన
  • జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్ - నాగపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో... నిన్న యువతిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టించి చంపేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కూడా గాయపడ్డారు. యువతి మృతికి కారణమైన వారిని శిక్షించాలని నిరసన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో వాహనాలు జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి.
Go Back to Shorts
Hyderabad
nagapur
national highway

More Telugu News