నాగార్జున 'నా సామిరంగ' నుంచి విజిల్ థీమ్ సాంగ్ విడుదల

Whistle theme song from Naa Saamiranga out now
  • నాగార్జున హీరోగా నా సామిరంగ చిత్రం
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ
  • సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న 'నా సామిరంగ'  
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా సామిరంగ'. తాజాగా ఈ చిత్రం నుంచి విజిల్ థీమ్ సాంగ్ రిలీజైంది. దేవుడే... తన చేతితో... రాసిన... ఒక కావ్యం... అంజిది, కిష్టయ్యది విడదీయని ఒక బంధం... అంటూ సాగే ఈ గీతం నా సామిరంగ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేశ్ ల మధ్య స్నేహానుబంధాన్ని చాటుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు బాణీలే కాదు లిరిక్స్ కూడా అందించారు. ఈల పాటగా పాడుకోగలిగేంత ఆహ్లాదకరంగా ఉన్న ఈ గీతాన్ని శాండిల్య పీసపాటి ఆలపించారు. 

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామిరంగ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తదితరులు నటించారు.
Advertisement
Naa Saamiranga
Whistle Theme Song

More Telugu News