తనిఖీలకు వెళ్తున్న ఈడీ బృందంపై దాడి.. టీఎంసీ నేత అరెస్ట్
- రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణలపై తనిఖీకి ఈడీ బృందం
- అధికారులు, సాయుధ బలగాలను చుట్టుముట్టి దాడి చేసిన 200 మందికిపైగా స్థానికులు
- గాయపడిన అధికారులు ఆసుపత్రికి తరలింపు
- టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్
అధికారులపై దాడిచేసిన స్థానికులు వారు ప్రయాణిస్తున్న వాహనాలపైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. రోహింగ్యాల వల్ల రాష్ట్రంలోని శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరారు. ఈడీ అధికారులపై దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.