దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఎలా చెప్పారో చూడండి!
- నేడు నూతన సంవత్సరాది
- అందరికీ శుభాకాంక్షలు తెలిపిన దర్శకేంద్రుడు
- టేబుల్ నిండా కమలా ఫలాలతో దర్శనమిచ్చిన రాఘవేంద్రరావు
ఇవాళ నూతన సంవత్సరాది నేపథ్యంలోనూ దర్శకేంద్రుడు తన ట్రేడ్ మార్కును ప్రదర్శించారు. తన కార్యాలయంలో టేబుల్ ను కమలాఫలాలతో నింపేశారు. ఈ కొత్త ఏడాది అందరికీ 'ఫల'ప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు... అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ... మీ రాఘవేంద్రరావు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో వీడియోను పంచుకున్నారు.