జైల్లో ఉన్న ఆ ఐదుగురు నా హీరోలే: కేజ్రీవాల్
- ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆప్ రాజకీయాలు చేస్తుందన్న కేజ్రీవాల్
- జైలుకు వెళ్లేందుకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు
- ఇతర పార్టీలు పట్టించుకోని విషయాలను ఆప్ పట్టించుకుందని వ్యాఖ్య
జైల్లో ఉన్న తమ ఐదుగురు నాయకులూ తన హీరోలే అని కేజ్రీవాల్ చెప్పారు. ఇతర పార్టీలు పట్టించుకోని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ ఎదిగిందని అన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ నెల 3న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపించింది. గతంలో కూడా రెండు సార్లు ఈడీ సమన్లు పంపించింది. అయితే, ఆయన విచారణకు హాజరుకాలేదు.