కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గూగుల్ సరికొత్త డూడుల్
- యానిమేటెడ్ డూడుల్ ను షేర్ చేసిన కంపెనీ
- 2024 ఏడాదికి స్వాగతం చెబుతూ వినూత్న డూడుల్
- గతేడాది జ్ఞాపకాలను.. కొత్త ఏడాది ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన
ఈ యానిమేటెడ్ డూడుల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సహా పలు ప్రత్యేక సందర్భాలలో వినూత్న డూడుల్స్ తో వారికి నివాళులు తెలియజేయడం గూగుల్ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. దీంతో పాటు న్యూఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు తాజాగా ఈ సరికొత్త డూడుల్ ను రూపొందించింది.