లక్ష కోట్లలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేశారని ఆరోపణ
- ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కాలంలో ఆనకట్ట కుంగిపోవడం... తలదించుకునే పరిస్థితని విమర్శ
- వేరే సంస్థతో విచారణ జరిపించాలన్న జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై అధికారులు... ఇంజినీర్ల సమాధానాలపై ఆధారపడకుండా వేరే సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జ్యూడిషియల్ విచారణ కోసం వేచి చూడవద్దని సూచించారు. అసలు రెండో టీఎంసీ పనులు పూర్తి కాకముందే మూడో టీఎంసీకి ఏమి అవసరం వచ్చింది? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా కట్టారని ఆరోపించారు. పెన్ గంగను వదిలేసి వార్దాపై ఆనకట్టను ఎలా ప్రతిపాదించారు? అని ప్రశ్నించారు.