'వ్యూహం' సినిమా సెన్సార్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ

'వ్యూహం' సినిమా సెన్సార్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ

AP Congress files petition on Vyuham movie
  • వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వర్మ
  • వ్యూహం చిత్రంపై తాజాగా మరో వివాదం
  • సెన్సార్ సర్టిఫికెట్ ను పునఃసమీక్షించాలన్న ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
  • పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల చిత్రంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా వ్యూహం చిత్రంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ ను పునఃసమీక్షించాలంటూ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ చిత్రంలోని పాత్రలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు, రేపు విచారణ చేపట్టనుంది.
Advertisement
Vyuham
Congress
AP High Court
Sonia Gandhi
Andhra Pradesh

More Telugu News