Vijaykanth: విజయకాంత్ మృతిపై చంద్రబాబు స్పందన

Chandrababu reacts to Vijaykanth demise
షార్ట్స్‌లో చూడండి
అసలే తీవ్ర అనారోగ్యం, దానికి తోడు కరోనా సోకడంతో ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కోలుకోలేకపోయారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయకాంత్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ ఇక లేరన్న వార్త తెలిసి తీవ్ర విచారం కలిగిందని పేర్కొన్నారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijaykanth
Demise
Chandrababu
TDP
Andhra Pradesh
Kollywood
Tamil Nadu

More Telugu News