దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ గెలవాలంటే ఆట ఒక్కటే సరిపోదట.. ఏం కావాలో చెప్పిన ద్రవిడ్
- సఫారీ గడ్డపై అదృష్టం కూడా ఉండాలన్న చీఫ్ కోచ్
- రెండుసార్లు విజయానికి దగ్గరగా వచ్చి సాధించలేకపోయామని ఆవేదన
- ఈసారి అవకాశాలను అందిపుచ్చుకుంటామని ధీమా
సిరీస్ విజయానికి రెండుసార్లు దగ్గరగా వచ్చినప్పటికీ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈసారి మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టబోమని పేర్కొన్నాడు. చక్కగా బంతులు సంధించడంతోపాటు క్రీజులో పాతుకుపోయే లక్షణం ఉంటే ఇక్కడ మ్యాచ్‌లు గెలవొచ్చని ద్రవిడ్ వివరించాడు.