ఏపీలో వాలంటీర్ల నిరసన బాట.. నేటి నుంచి సమ్మె
- జీతాలపై వాలంటీర్లలో అసంతృప్తి
- వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ సమ్మెకు నిర్ణయం
- వాలంటీర్లతో సమ్మె విరమింపజేసేందుకు అధికారుల ప్రయత్నం విఫలం
2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వాలంటీరుకు రూ.5 వేలు గౌరవవేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే, గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్లకు రూ. 750 జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే.