Infosys: కృత్రిమ మేధ ఉత్పత్తుల కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇన్ఫోసిస్!

Infosys loses big ai contract
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఓ ఏఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయింది. కృత్రిమ మేధ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి ఓ గ్లోబల్ కంపెనీతో కుదుర్చుకున్న ఎమ్ఓయూ రద్దు చేసుకున్నట్టు కంపెనీ తాజాగా స్టాక్ ఎక్సేంజీకి తెలిపింది. కాంట్రాక్ట్ రద్దు చేసుకునేందుకు సదరు గ్లోబల్ కంపెనీ మొగ్గు చూపినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. 

1.5 బిలియన్ డాలర్లతో ఈ సెప్టెంబర్‌లో రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఏఐ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి 15 ఏళ్ల గడువుతో రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దుకు మొగ్గు చూపింది. దీంతో, టెక్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులపై మరోమారు చర్చ మొదలైంది. కాగా, శుక్రవారం ఇన్ఫోసిస్ షేరు 1.68 శాతం మేర లాభపడి రూ.1,562కు చేరింది.
Go Back to Shorts
Infosys
AI
Stock Market

More Telugu News