ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు
- ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశాలు
- తెలంగాణ నుంచి దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి హాజరు
- ఏపీ నుంచి రఘువీరా, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డిలు హాజరు
సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఇన్వైటీ వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో... ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు.