లిక్కర్ స్కాం కేసులో రామచంద్ర పిళ్లైకి బెయిల్
- భార్య అనారోగ్యంతో ఉందంటూ పిళ్లై బెయిల్ పిటిషన్
- విచారించిన సీబీఐ స్పెషల్ కోర్టు
- రెండు వారాలు బెయిల్ మంజూరు చేసిన జడ్జి
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. పిళ్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో 8 వారాల బెయిల్ కోసం పిళ్లై చేసుకున్న దరఖాస్తును సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ సోమవారం విచారించారు. పిళ్లై తరఫున న్యాయవాది నితీశ్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు. తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని, ఆమెను చూసుకోవడానికి అయినవాళ్ళు ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.