VV Lakshminarayana: ఇతరులకు బానిసలుగా మారకండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్

VV Lakshminarayana cryptic tweet garners attention
  • రచయిత డాన్ కో సందేశాన్ని పంచుకున్న లక్ష్మీనారాయణ
  • చర్చనీయాంశంగా మారిన ట్వీట్
  • గతంలో జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. ఇతరులకు బానిసలుగా మారకండి అంటూ ఆయన చేసిన ట్వీట్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రముఖ రచయిత డాన్ కో సందేశాన్ని పంచుకున్నారు. 

"మీకు ఆలోచనలు లేకపోతే... చదవండి. మీకు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని స్పష్టంగా చెప్పలేకపోతే... వాటిని వ్రాయండి. మీకు ఆలోచనలు ఉండి, వాటిని అమలు చేయడానికి స్పష్టత ఉంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. అంతే తప్ప ఇతరులకు బానిసలుగా మారకండి" అంటూ హితబోధ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వ్యాఖ్యలను లక్ష్మీనారాయణ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

లక్ష్మీనారాయణ 2020లో జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News