Congress: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జుల నియామకం

17 lok Sabha incharges announced in telangana
షార్ట్స్‌లో చూడండి
రానున్న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇంఛార్జులను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు - రేవంత్ రెడ్డి; సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క; నాగర్ కర్నూలు - జూపల్లి కృష్ణారావు; నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి; భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి; వరంగల్ - కొండా సురేఖ; మహబూబాబాద్, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి; అదిలాబాద్ - సీతక్క; పెద్దపల్లి - దుద్దిళ్ల శ్రీధర్ బాబు; కరీంనగర్ - పొన్నం ప్రభాకర్; నిజామాబాద్ - జీవన్ రెడ్డి; జహీరాబాద్ - పి.సుదర్శన్ రెడ్డి; మెదక్ - దామోదర రాజనర్సింహ; మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వర రావు.
Go Back to Shorts
Congress
Telangana
Lok Sabha
Revanth Reddy

More Telugu News