అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్

Bigg Boss Season 7 grand finale episode has begun
  • నేటితో ముగియనున్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్
  • కాసేపట్లో విజేత ఎవరో తేలనున్న వైనం
  • ఫైనల్ ఎపిసోడ్ కు హాజరైన మాజీ కంటెస్టెంట్లు
105 రోజుల పాటు 19 మంది కంటెస్టెంట్లతో తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్-7 రియాలిటీ షో నేటితో ముగియనుంది. ఇవాళ స్టార్ మా చానల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున రష్యన్ డ్యాన్సర్లతో ఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత మాజీ కంటెస్టెంట్లు తమ ఆటాపాటతో అలరించారు. 

బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లాక మీ లైఫ్ ఎలా మారిపోయిందని మాజీ కంటెస్టెంట్లను నాగ్ ప్రశ్నించారు. అందులో చాలామంది తమ జీవితంలో మునుపటి కంటే ఊహించనంత మారిపోయిందని వెల్లడించారు. టేస్టీ తేజ స్పందిస్తూ... తనకు 15 సినిమాల్లో చాన్సులు వచ్చాయని వెల్లడించగా, తనకు రెండు సినిమాల్లో హీరోగా నటించే అవకాశం దక్కిందని గౌతమ్ కృష్ణ తెలిపాడు. 

శుభశ్రీ అయితే తనకు పవన్ కల్యాణ్ సినిమాలో చాన్స్ వచ్చిందని చెప్పి మురిసిపోయింది. అంతేకాదు, భోలా షావలితో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేశానని వెల్లడించింది. ఇక, మిగతా మాజీ కంటెస్టెంట్లు కూడా తమకు పబ్లిక్ లో విశేషమైన గుర్తింపు లభిస్తోందని, ఎక్కడికి వెళ్లినా తమను ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Bigg Boss
Season-7
Grand Finale
Nagarjuna
Star Maa

More Telugu News