విషాదం మిగిల్చిన సెలవు.. సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
- మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్ వద్ద ఘటన
- ఆదివారం కావడంతో బీచ్‌కు వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
- నలుగురిని కాపాడిన మెరైన్ పోలీసులు
- గల్లంతైన అఖిల్ అనే విద్యార్థి కోసం గాలింపు
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి తోకల అఖిల్, తన స్నేహితులైన మరో నలుగురితో కలిసి ఈ ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు. స్నానం కోసం వారంతా సముద్రంలోకి దిగిన తర్వాత పెద్ద రాకాసి అల ఒక్కసారిగా విరుచుకుపడి వారిని లాక్కెళ్లిపోయింది. మెరైన్ పోలీసుల అప్రమత్తతతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన అఖిల్ కోసం గాలిస్తున్నారు.