నేటి నుంచి ఐదు రోజులపాటు ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు చూడడం మిస్సయితే బాధపడతారు?
- మిరుమిట్లు గొలిపే కాంతితో జారిపడనున్న ఉల్కలు
- ఈ నెల 20 వరకు నేరుగా వీక్షించొచ్చు
- రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు ఉల్కాపాతం
ఉల్కలుగా రాలిపడే క్రమంలో గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ (ఐఎంవో) తెలిపింది. ఈ ఉల్కాపాతాన్ని గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ నేరుగా చూడొచ్చని, ఉల్కాపాతాన్ని వీక్షించేవారు ఫొటోలు, వీడియోలు తీసి ఐఎంవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కూడా చేయవచ్చని తెలిపింది.