Karimnagar District: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Two dead and one injured in road accident in Karimnagar District
  • శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఘటన
  • కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టిన లారీ
  • మృతులది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
కరీంనగర్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్న కారును శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  

మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar District
Road Accident
Jayashankar Bhupalpally District
Tekumatla

More Telugu News