Kadiam Srihari: నా మాటలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారు: కడియం శ్రీహరి

Kadiyam Srihari on Congress leaders comments
  • కాంగ్రెస్‌కు బొటాబోటి మెజార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయని తెలిసిందేనన్న కడియం
  • ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ల హామీలకు సహకరించదని వెల్లడి
  • మీరు బాగా పని చేయాలని మాత్రమే చెప్పానన్న కడియం శ్రీహరి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని, ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కడియం గురువారం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కడియం అన్నారు. కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కామన్ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ల హామీలకు సహకరించదన్నారు. ఏదేమైనా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉందని గుర్తు చేశారు.

మీరు బాగా పని చేయాల్సి ఉందని మాత్రమే తాను చెప్పానని, కానీ కాంగ్రెస్ నేతలు ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ వాళ్లే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం లేదని, అందుకే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే తాను ఒకటి చెబితే వాళ్లు మరొక విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

  • Loading...

More Telugu News