YSRCP: లోక్ సభ ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న టైమ్స్ నౌ సర్వే

Times Now ETG Survey says YCP can win 25 seats in Lok Sabha Elections
  • మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు
  • టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో ఆసక్తికర అంశాలు
  • ఏపీలో వైసీపీకి 25 ఎంపీ స్థానాలు వస్తాయని వెల్లడి
  • టీడీపీకి ఒక స్థానం దక్కే అవకాశాలు చాలా స్వల్పం అని వివరణ
టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఏపీలో మొత్తం లోక్ సభ స్థానాలు 25 కాగా... ఎన్నికలు వస్తే ఏపీలో ఈసారి వైసీపీ క్వీన్ స్వీప్ చేస్తుందని సర్వే చెబుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 24-25 సీట్లు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. 

చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ లోక్ సభలో ఉనికి కోల్పోతుందని, ఆ పార్టీకి కనీసం ఒక ఎంపీ స్థానం లభించే అవకాశాలు అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని వివరించింది. 

ఇక, ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన ప్రేక్షక పాత్ర పోషించడం మినహా, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే తెలిపింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలు నెగ్గగా, టీడీపీ 3 స్థానాలు సాధించింది. 
YSRCP
Lok Sabha
Elections
Andhra Pradesh
Times Now-ETG Survey

More Telugu News