స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ నామినేషన్... ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్ సంతకం
- స్పీకర్ పదవి నామినేషన్‌కు కేటీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, కేటీఆర్, మల్లుభట్టి, కూనంనేని
- రేపు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
కాగా స్పీకర్ పదవికి బుధవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చునని ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. బీఆర్ఎస్ మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు అంటే 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు పద్నాలుగువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.