గొంతు ఇన్ఫెక్షన్‌తో యశోద ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఎన్నికల సమయం నుంచీ గొంతునొప్పితో బాధపడుతున్న వెంకటరెడ్డి
- మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరిక
- భయపడాల్సింది ఏమీ లేదన్న వైద్యులు
నిన్న ఢిల్లీ వెళ్లిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కలిసి కోరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత యశోద ఆసుపత్రిలో చేరారు.